kcr: ఇన్నేళ్లుగా చేయలేక పోయారు.. కేవలం రెండేళ్లలో చేశాం : ముఖ్యమంత్రి కేసీఆర్


తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో హోంగార్డుల సమస్యలపై చర్చించిన అనంతరం
జాతీయ రహదారులపై చర్చించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ‌కు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనేందుకే ప్రత్యేక తెలంగాణ పోరాటం చేపట్టినట్లు వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమానికి 1999లోనే బీజం పడగా 2001లో పూర్తిస్థాయి ఉద్యమం ప్రారంభమ‌యిన‌ట్లు పేర్కొన్నారు. 70 ఏళ్లుగా  తెలంగాణలో ఎన్ని కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించారో, రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత కేవ‌లం రెండేళ్ల‌లో అంతే స్థాయిలో ర‌హ‌దారుల‌ను నిర్మించామ‌ని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంగా ఏర్ప‌డే స‌మ‌యంలో జాతీయ రహదారుల విషయంలో అట్టడుగున ఉందని కేసీఆర్ చెప్పారు. ఆ ర‌హ‌దారుల‌ను నిర్మించ‌డానికి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోవ‌డంలో ఎంతో కృషి చేసి, స‌క్సెస్ అయింద‌ని చెప్పారు. దిన‌దినాభివృద్ధి చెందుతూ విస్త‌రిస్తున్న‌ హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న ఔటర్‌ రింగ్‌రోడ్‌ ఏమాత్రం సరిపోదని కేసీఆర్ అన్నారు. మరో రింగ్‌రోడ్‌ నిర్మించాలని తాము కేంద్ర స‌ర్కారుకి విజ్ఞ‌ప్తి చేసినట్లు పేర్కొన్నారు. త‌మ విన్న‌తి ప‌ట్ల సానుకూలంగా స్పందించి, హైద‌రాబాద్‌ చుట్టూ 338కిలోమీటర్ల రీజినల్‌ రింగ్‌రోడ్ నిర్మాణానికి కేంద్ర స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు కేసీఆర్ తెలిపారు.

kcr
  • Loading...

More Telugu News