: అమీర్! నిన్ను ద్వేషిస్తున్నా: వైరల్ అయిన సల్మాన్ ట్వీట్
"నా కుటుంబం 'దంగల్' చిత్రాన్ని చూసింది. ఇది 'సుల్తాన్'తో పోలిస్తే బాగున్న చిత్రం. నిన్ను వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నా, అయితే, వృత్తిపరంగా మాత్రం ద్వేషిస్తున్నా" అంటూ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. నిన్న సాయంత్రం సల్మాన్ కుటుంబం ఈ చిత్రాన్ని చూడగా, అర్ధరాత్రి 1:37 గంటల సమయంలో ఈ ట్వీట్ ను కండల వీరుడు వదిలాడు. ఈ సంవత్సరంలో సుల్తాన్ అలీఖాన్ అనే ఒలింపిక్ రెజ్లర్ పాత్రను తీసుకుని ఓ కల్పిత కథతో సల్మాన్ హీరోగా విడుదలైన 'సుల్తాన్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అమీర్ ఖాన్ ప్రముఖ రెజ్లర్ మహావీర్ సింగ్ పోగెట్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'దంగల్'లో నటించాడు. ఈ చిత్రం అద్భుతమని, భారత సినీ చరిత్రలో అత్యుత్తమ క్రీడా నేపథ్యమున్న చిత్రమని ప్రశంసలు దక్కుతున్నాయి.