: కేసీఆర్ దత్తత గ్రామాల్లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వాస్తు దోషం... అందులో నివసిస్తే చితికిపోతారు!: వాస్తు ప్లానర్స్ అధినేత ప్రకాష్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఈ రోజు ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలో ఈ ఇళ్లను ఉదయం ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులంతా సామూహికంగా గృహప్రవేశం చేశారు. అయితే, ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వాస్తు దోషం ఉందని వాస్తు ప్లానర్స్ అధినేత ప్రకాష్ తెలిపారు. పేదలు నివసించబోయే ఈ ఇళ్లు వాస్తు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ ఇళ్లలో నివసించేవారు ఆర్థికంగా, అనారోగ్యంగా చితికిపోతారని చెప్పారు.