: జయలలితకు భారతరత్న పొందే అర్హత లేదు: పీఎంకే
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న పురస్కారం పొందే అర్హత లేదని పీఎంకే నేత అన్బుమణి రాందాస్ అన్నారు. 15 అవినీతి కేసులను జయ ఎదుర్కొన్నారని... ఆమెను నిర్దోషిగా ప్రకటించిన కేసుకు సంబంధించిన అప్పీల్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని చెప్పారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈవిధంగా స్పందించారు. జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో శూన్యత ఏర్పడిందని... మరో నలుగేళ్లపాటు పార్టీని అధికారంలో నిలపాలన్న తాపత్రయంతోనే ఆ పార్టీ నేతలు శశికళకు మద్దతుగా నిలుస్తున్నారని అన్బుమణి చెప్పారు. శశికళకు ఏమాత్రం ప్రజామద్దతు లేదని అన్నారు. తన రాజకీయ వారసురాలిగా శశికళను జయలలిత ఏనాడూ ప్రకటించలేదని... ఒక వేళ ఆమెకు ఆ ఆలోచనే ఉంటే, పార్టీలో ఏదో ఒక పదవి ఇచ్చేవారని చెప్పారు.