: లంబసింగిలో 'సున్నా' డిగ్రీల ఉష్ణోగ్రత... వణుకుతున్న ఏజెన్సీ
విశాఖ ఏజెన్సీపై చలి పులి పంజా విసిరింది. రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. లంబసింగిలో రికార్డు స్థాయిలో నిన్న రాత్రి 'సున్నా' డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మినుములూరు, చింతపల్లిలలో 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొగమంచు ఏజెన్సీని కమ్మేసింది. ఉదయం 10 గంటలు దాటితేకాని, పరిసరాలు స్పష్టంగా కనపడని పరిస్థితి మన్యంలో నెలకొంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో, గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.