: అక్కినేని అఖిల్-శ్రియా భూపాల్ పెళ్లి పనులకు శ్రీకారం!
అక్కినేని అఖిల్, శ్రియా భూపాల్ ల పెళ్లి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఈ శుభకార్యం ఎప్పుడు జరిగిందనే విషయం తెలియదు. ఇందుకు సంబంధించిన ఒక ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. శ్రియ కుటుంబం పసుపు కొట్టి పెళ్లి పనులు ప్రారంభించినట్లు ఈ ఫొటో ద్వారా తెలుస్తోంది. శ్రియా భూపాల్ సహా మిగిలిన మహిళలు పసుపు పచ్చ రంగు దుస్తుల్లోకనిపిస్తున్నారు.