: ఏదో ఒకటి మాట్లాడకండి... దమ్ముంటే సమాధానం చెప్పండి: అసెంబ్లీలో అక్బరుద్దీన్ మండిపాటు
తెలంగాణ శాసనసభలో ఎంఐఎం పార్టీ శాసనసబాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ విపక్ష నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదు తాగునీటి సమస్యపై ఆయన మాట్లాడుతూ, హైదరాబాదుకు కృష్ణా, గోదావరి, మూసీ, మంజీరా ఇతర నదుల నుంచి ఎన్ని జలాలు వస్తున్నాయో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. అలా వాటాగా వస్తున్న జలాలు రిజర్వ్ చేసేందుకు మన వద్ద స్థలం ఉందా? అని ఆయన అడిగారు. వెంటనే అధికార పక్షం సభ్యులు 'హై' అనడంపై అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ కూర్చుని హై, హే అనడం కాదని...తనకు సమాధానం చెప్పే సత్తా ఉంటే మాట్లాడాలని, లేని పక్షంలో మౌనంగా కూర్చోవాలని సూచించారు. అనవసర కామెంట్లు చేస్తే సరికాదని ఆయన హితవు పలికారు. దీంతో శాసనసభ సైలెంట్ అయిపోయింది.