: 3 జీ స్మార్ట్ ఫోన్ల వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్న రిలయన్స్ జియో!
ఉచితం అనే మంత్రంతో టెలికం రంగంలో మిగతా కంపెనీలకు గట్టిపోటీనిస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియో తమ వినయోగదారుల ముందుకు మరో ఆఫర్‌ను తీసుకురావాలని చూస్తోంది. జియో ప్రస్తుతం 4జీ ద్వారా ఉచిత ఇంటర్నెట్, అపరిమిత టాక్‌టైం ఆఫర్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే ఆఫర్‌ను 3జీ యూజర్ల ముందుకు కూడా తీసుకురావాలని చూస్తోంది. సదరు సంస్థ ఇందు కోసం ఇప్పటికే ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. 3జీ యూజర్లకు కూడా తమ ఉచిత సేవలను విస్తరించడం ద్వారా మరింత పెద్ద సంఖ్యలో కస్టమర్లను సొంతం చేసుకోవాలని జియో యోచిస్తోంది. ఈ నెలాఖరులో హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో జియో మరో ఆఫర్‌ను కూడా తమ వినియోగదారుల ముందుకు తెస్తోన్న విషయం తెలిసిందే.