: కేవలం ఒక్కసారే ఛార్జీలు పెంచాం... అయినా తెలంగాణలోనే ఛార్జీలు తక్కువ: టీఎస్ మంత్రి మహేందర్ రెడ్డి


తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాతనే ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచామని టీఎస్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలపై భారం పడకూడదన్న ఆలోచనతోనే కేవలం 6.7 శాతం ఛార్జీలను పెంచామని చెప్పారు. ప్రతిరోజు రూ. కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు నష్టాలు వస్తుండటంతో... తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన సంగతిని గుర్తుంచుకోవాలని చెప్పారు. గత ప్రభుత్వం 2010-13 మధ్య కాలంలో మూడు సార్లు బస్సు ఛార్జీలను పెంచిందని తెలిపారు. ఈ రోజు శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు డీకే అరుణ, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మహేందర్ రెడ్డి పైవిధంగా స్పందించారు.  

  • Loading...

More Telugu News