demonitisation rides: పెద్ద నోట్ల రద్దుతో వెల్లడైన నల్లధనం వివరాలు తెలిపిన అధికారులు


పెద్ద‌నోట్ల రద్దు నేప‌థ్యంలో నిఘా పెట్టిన ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు న‌ల్ల‌కుబేరుల నుంచి భారీ మొత్తంలో న‌ల్ల‌ధ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు. నవంబర్‌ 9 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దేశవ్యాప్తంగా మొత్తం రూ.3,300 కోట్ల విలువచేసే నల్లధ‌నం బ‌య‌ట‌ప‌డింది. వాటిలో రూ. 92 కోట్ల కొత్త కరెన్సీ  చిక్కింది. దేశ‌వ్యాప్తంగా ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు ఇప్ప‌టివ‌ర‌కు 734 దాడులు, త‌నిఖీలు నిర్వహించారని సంబంధిత అధికారులు తెలిపారు. ఇక‌ పన్ను ఎగవేత, హవాలా వ్యాపారంతో పాటు సంపద ఇత‌ర‌ అభియోగాలకు సంబంధించి మొత్తం 3,200 మందికి ఐటీ నుంచి నోటీసులు అందాయ‌ని చెప్పారు.

ఈ త‌నిఖీల్లో రూ.500 కోట్లకు పైగా విలువచేసే బంగారం, ఇత‌ర‌ ఆభరణాలు, నగదు ల‌భించాయని సంబంధిత అధికారులు తెలిపారు. దేశంలో స్వాధీనం చేసిన ఆస్తుల మొత్తం విలువ‌ రూ. 500 కోట్లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న‌ ర‌ద్ద‌యిన 500, 1000 రూపాయ‌ల నోట్ల విలువ‌ రూ. 421 కోట్లు ఉంటుంద‌ని చెప్పారు. త‌మ‌ దాడులకు సంబంధించి 220 సీరియస్‌ కేసుల విచారణ బాధ్యతను సీబీఐ, ఈడీలకు అప్ప‌గించార‌ని అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News