: కలెక్టర్ గారికి కోపమొచ్చింది... సిబ్బందిని కర్రతో చితకబాదారు!


తన నివాసంలో విధులు నిర్వహిస్తున్నప్లాటూన్ కమాండర్ ను, హోంగార్డులను కలెక్టర్ చితకబాదిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. బహ్రెయిచ్ జిల్లా కలెక్టర్ అభయ్ సింగ్ అధికార నివాసంలోని రెండు చెట్లను ఎవరో నరికేశారు. దీనిని గమనించిన కలెక్టరు, అక్కడ విధులు నిర్వహిస్తున్న తమను చితకబాదారని, వారిని విధుల నుంచి తప్పించారని ప్లాటూన్ కమాండర్ హరిశ్చంద్ర శర్మ, హోంగార్డులు దర్బరీలాల్, శివకుమార్, మహ్మద్ కమరుద్దీన్, ధర్మరాజ్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బహ్రెయిచ్ కలెక్టరేట్ వద్ద బాధితులు ధర్నాకు దిగారు. అయితే, కలెక్టర్ తమపై దాడి చేశారనే బాధితుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు మాత్రం నమోదు చేయలేదు.

  • Loading...

More Telugu News