: చంద్రబాబుకు శ్రీలంక అధ్యక్షుడి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆహ్వానం పంపారు. శ్రీలంకలో జనవరి 8న జరగనున్న పేదరిక నిర్మూలన సదస్సులో పాల్గొని ప్రసంగించాలని ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆయన వెళ్లే అవకాశం కనిపిస్తోంది.