: రూ. 80 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్


బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఆదాయం విషయంలో దూసుకుపోతున్నాడు. రూ. 80 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ (ముందస్తు పన్ను) చెల్లించి అందరికీ షాక్ ఇచ్చాడు. సినిమాలు, యాడ్స్, హెచ్ఆర్ఎక్స్ ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయానికి గానూ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాడు హృతిక్. గత ఏడది రూ. 50 కోట్ల అడ్వాన్స్ చెల్లించిన హృతిక్... ఈ ఏడాది మరో రూ. 30 కోట్లు అధికంగా చెల్లించాడు. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులో హృతిక్ తర్వాతి స్థానంలో అమీర్ ఖాన్ (రూ. 72 కోట్లు) ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో రణబీర్ కపూర్ (37 కోట్లు), సల్మాన్ ఖాన్ (14 కోట్లు), అక్షయ్ కుమార్ (10 కోట్లు) ఉన్నారు. అయితే షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్ లాంటి స్టార్లు ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారనే విషయాన్ని ఐటీ డిపార్ట్ మెంట్ ఇంకా వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News