: ఒకేసారి ఐదు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన ఎల్జీ.. వాటి వివరాలు
ఒకేసారి ఐదు సరికొత్త స్మార్ట్ ఫోన్లను దక్షిణ కొరియా ఎలట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ విడుదల చేసింది. వీటిల్లో నాలుగు కే-సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఉండగా, ఒకటి స్టైలస్ స్మార్ట్ ఫోన్. ఈ స్టైలస్ మిడ్ రేంజ్ విభాగంలో తమ విక్రయాలను మరింత పెంచుతుందని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా సంస్థ పేర్కొంది. లాస్ వెగాస్ లో జరిగే సీఈఎస్ 2017కు ముందు ఈ ఫోన్లు విడుదల కావడం గమనార్హం. ఎల్జీ ఆవిష్కరించిన స్మార్ట్ ఫోన్ వివరాలు...
ఎల్జీ కే3 : 4.5 అంగుళాల డిస్ ప్లే, 1.1 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 5/2 ఎంపీ కెమెరాలు, 2100 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఎల్జీ కే4: 5 అంగుళాల డిస్ ప్లే, 1.1 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 5/5 ఎంపీ కెమెరాలు, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఎల్జీ కే8: 5 అంగుళాల డిస్ ప్లే, 1.4 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 13/5 ఎంపీ కెమెరాలు, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఎల్జీ కే10: 5.3 అంగుళాల డిస్ ప్లే, 1.5 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 16/5 ఎంపీ కెమెరాలు, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్.
ఎల్జీ స్టైలస్ 3: 5.7 అంగుళాల డిస్ ప్లే, 1.5 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 13/8 ఎంపీ కెమెరాలు, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్.
వీటి ధరల వివరాలు తెలియాల్సి వుంది.