: దాని గురించి ఆలోచించడం కూడా ఇష్టం ఉండదు: ప్రియాంక చోప్రా


హాలీవుడ్ సిరీస్ 'క్వాంటికో'తో గ్లోబల్ స్టార్ గా ఎదిగింది బాలీవుడ్ సుందరి ప్రియాంక చోప్రా. తన తొలి హాలీవుడ్ మూవీ 'బేవాచ్' త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవలే ఆమె భారత్ కు తిరిగొచ్చింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ప్రియాంకకు ఓ ప్రశ్న వేశారు. గ్లోబల్ స్టార్ గా ఎదిగి తిరిగి వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ల ప్రవర్తనలో ఏదైనా మార్పును గమనించారా? అని ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా, తనకు ఫేమస్ కావాలనే ఆలోచన లేదని... సక్సెస్ కావాలనే తపన మాత్రమే ఉందని చెప్పింది. అసలు దాని గురించి ఆలోచించడం కూడా ఇష్టం ఉండదని తెలిపింది. మనది పురుషాధిక్య సమాజమని... అందువల్ల మహిళలు తమ వంతుగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, చివరకు పురుషుల మీదనే ఆధారపడతారని చెప్పింది. కానీ, తాను అలాంటి దాన్ని కాదని... పురుషుల మీద ఆధారపడకుండానే ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం తనకు ఉందని చెప్పింది. తన తల్లిదండ్రులు తనను చిన్నప్పటి నుంచి అబ్బాయిలాగానే పెంచారని తెలిపింది. 

  • Loading...

More Telugu News