: రేపు టీడీపీలోకి జంప్... ముహూర్తం కుదుర్చుకున్న వైకాపా ఎమ్మెల్యే కల్పన!


పామర్రు ఎమ్మెల్యే, వైకాపా నేత ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరుతున్నట్లు స్పష్టం చేసి, గత నాలుగు రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. ఈ నెల 23వ తేదీన సీఎం చంద్రబాబు సమక్షంలో ఆమె పచ్చ కండువా కప్పుకోనున్నారు. నిన్న సాయంత్రం పామర్రులో వైకాపా, తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడిన ఆమె, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి నేతలంతా విజయవాడ రావాలని కోరారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నానన్న ఆనందం తప్ప, అభివృద్ధి చేయలేకపోతున్నానన్న బాధ ఉండేదని, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News