: మిల్కీ బ్యూటీకి బర్త్ డే విషెస్ చెప్సిన రామ్ చరణ్ భార్య
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నాకు పలువురు సినీ నటులు, ప్రముఖులు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా తమన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాను కలుసుకున్న మంచి మనసున్న, సంతోషాన్ని కల్గించే వారిలో ఆమె కూడా ఒకరని ఉపాసన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిక్కీ మౌస్ తో కలిసి పోజు ఇస్తున్న తమన్నా ఫొటోను ఉపాసన పోస్టు చేశారు.