: ఆడియెన్స్ లో ఫ్యామిలీ, మాస్, క్లాస్ అనే విభజన ఉండదు: వర్మ
సినిమాలను అభిమానించే ఆడియెన్స్ మాత్రమే ఉంటారని.. వారిని ఫ్యామిలీ, క్లాస్, మాస్ అంటూ ఎందుకు విడదీస్తారని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. 'వంగవీటి' సినిమా ప్రమోషన్ లో ఆయన మాట్లాడుతూ, అసలు ఇలా ఎందుకు విడదీస్తారో తనకు తెలియదని, తన వరకు అయితే మాత్రం 'ఆడియెన్స్' మాత్రమే ఉంటారని అన్నారు. ఎక్కడైనా సినిమాలు రిలీజైతే అందులో 99 శాతం ఫిక్షనే ఉంటుందని ఆయన చెప్పారు.
అయితే సినిమా నడిచే నేపథ్యానికి ఆడియెన్స్ కనెక్ట్ అవుతారని, ఎక్కడో తీసిన 'గాడ్ ఫాదర్' సినిమా చూసి తాను అభిమానించానని ఆయన చెప్పారు. సినిమా ఎవరినైనా ఆకర్షిస్తుందని, సినిమా లక్ష్యం ఆడియెన్స్ ను అలరించడమేనని, అందులో వర్గాలు ఉండవని ఆయన తెలిపారు. ఏ సినిమానైనా అంతా ఆదిరిస్తేనే విజయవంతం అవుతుందని ఆయన అన్నారు.