: గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరులకు జైల్లో రాజభోగాలు కల్పించిన అధికారులపై వేటు!


గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరులకు జైల్లో రాజభోగాలు కల్పించిన వరంగల్ సెంట్రల్ జైలు అధికారులపై వేటు పడింది. జైలర్ గోపీరెడ్డి, మరో ఎనిమిది మంది అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు చేసిన జైళ్ల శాఖ అవినీతి అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అందుకున్న వారిలో వరంగల్ రేంజ్ జైళ్ల శాఖ డీఐజీ కేశవనాయుడు, మాజీ సూపరింటెండెంట్ న్యూటన్, డిప్యూటీ సూపరింటెండెంట్ డిఎం శ్రీనివాస్, డిప్యూటీ జైలర్ సుభాష్ సహా మరో నలుగురు వార్డెన్ లు ఉన్నారు. కాగా, నయీమ్ అనుచరులు పాశం శీను, సుధాకర్ దగ్గర ముడుపులు తీసుకుని జైలులో వారికి రాజభోగాలు కల్పించినట్లు ఆయా అధికారులపై ఆరోపణల నేపథ్యంలోనే జైళ్ల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News