: శేఖర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ


టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, చెన్నైలో ప్రముఖ వ్యాపారవేత్త శేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 125 కోట్ల భారీ నల్లధనంతో శేఖర్ రెడ్డి పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను, ఆయన అనుచరులు ప్రేమ్, శ్రీనివాసరెడ్డిలను కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శేఖర్ రెడ్డి వద్ద లభ్యమైన నల్లధనం లెక్కల ఆధారంగా కేసు దర్యాప్తు జరపడంతో ఆయనకు తమిళనాడు సీఎస్ రామ్మోహనరావుతో సంబంధాలు వున్నట్టు తేలింది. దీంతో ఆయన, ఆయన బంధువులపై ఆదాయపుపన్ను శాఖ దాడులు జరుపుతున్న సంగతి, వందల కోట్ల రూపాయలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సీబీఐ కోర్టు ఎదుట శేఖర్ రెడ్డిని అధికారులు ప్రవేశపెట్టగా, జనవరి 3 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. 

  • Loading...

More Telugu News