: కరీనా దంపతులకు తిప్పలు.. కొడుకు పేరుపై విమర్శలు!
బాలీవుడ్ దంపతులు కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్ లకు నిన్న ఉదయం మగబిడ్డ జన్మించిన విషయం విదితమే. ఈ చిన్నారికి తైమూరు అలీఖాన్ పటౌడి అని పుట్టిన వెంటనే నామకరణం చేశారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా కరీనా దంపతులు తమ అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు .. ‘తైమూరు’ అనే పేరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే, ఆ పేరు మంగోల్ జాతి రాజు పేరని, ఈ పేరును ఎందుకు పెట్టారనేది వారి ప్రశ్న. అంతేకాకుండా, 14వ శతాబ్దంలో తైమూరు ఢిల్లీ పైకి దండెత్తి సర్వనాశనం చేశాడట. ఈ నేపథ్యంలోనే పలు విమర్శలు తలెత్తాయి. కాగా, ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఈ పేరుతో దేశ వ్యాప్తంగామొత్తం 5,500 మంది ఓటర్లు ఉన్నారు. కేవలం, పశ్చిమబెంగాల్ లోనే 3,351 మంది ఉండగా, యూపీలో 588 , మహారాష్ట్రలో 661, బీహార్ లో 558, జార్ఖండ్ లో 282 మంది ఉన్నారని, కొన్ని రాష్ట్రాల్లో ఒకట్రెండు పేర్లు ఉన్నాయని పేర్కొంది.