: విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాలపై 'రజనీగంధ' రాశాను!: పాపినేని శివశంకర్
తాను రాసిన కవితా సంపుటి ‘రజనీగంధ’కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడంపై ప్రముఖ కవి పాపినేని శివశంకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘రజనీగంధ’ తన ఐదో కవితా సంపుటి అని, ప్రపంచంలో విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాలు, విలువ గురించి ఈ కవితా సంపుటిలో ప్రధానంగా రాశానని చెప్పారు. దేశ విదేశాల్లో పర్యటన సందర్భంగా తనకు కలిగిన అనుభూతులపై, విలక్షణమైన వ్యక్తుల గురించి ఇందులో పలు కవితలు రాశానని చెప్పారు. ఇప్పటివరకు సుమారు 60 కథలు రాశానని, అందులో ‘సముద్రం’ అనే ఓ కథ తన కెంతో ఇష్టమని పాపినేని శివశంకర్ పేర్కొన్నారు.