: 1984 నాటి సిక్కులపై దాడుల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతకు ఊరట


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సజ్జన్ కుమార్ కు కోర్టులో ఊరట లభించింది. 1984లో సిక్కులపై జరిగిన దాడుల కేసులో సజ్జన్ కుమార్ నిందితుడుగా ఉన్నారు. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ హత్యకు గురైన తర్వాత ఢిల్లీలో సిక్కులపై దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక సజ్జన్ కుమార్ హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, ఈ దాడులకు సంబంధించి సజ్జన్ పై బాధితులు కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో, సజ్జన్ కుమార్ కు ద్వారక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల విలువైన రెండు బాండ్లను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించాలని షరతులు విధించింది. 

  • Loading...

More Telugu News