: ర్యాగింగ్ భూతం.. జూనియర్లతో మురుగునీరు తాగించిన సీనియర్లు


కేరళలోని మలప్పురం జిల్లా మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ల పై పైశాచికంగా ప్రవర్తించారు.జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడ్డారు. జూనియర్ విద్యార్థులతో టాయిలెట్లు కడిగించడంతో పాటు మురుగునీటిని తాగించారు. ఈ దారుణంపై  సుమారు 40 మంది జూనియర్ విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి ఈరోజు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన యాజమాన్యం ఈ  ఘటనకు కారణమైన 21 మందిని సస్పెండ్ చేసింది. ఈ సంఘటనపై ఒక కమిటీని దర్యాప్తునకు ఆదేశించింది. కాగా, కొట్టాయంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడిన సంఘటనలో విద్యార్థి మూత్ర పిండాలు దెబ్బతిన్నాయి. దీంతో, అతనికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులు లొంగిపోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
 

  • Loading...

More Telugu News