: జెర్సీ ఆవుల వల్లే ఓజోన్ పొర నాశనమవుతోందట!


పాశ్చాత్య ఆవుల త్రేన్పుల వల్లే ఓజోన్ పొరకు చిల్లుపడుతోందని గుజరాత్ ఆయుర్వేద యూనివర్శిటీ శాస్త్రవేత్త హితేష్ జైన్ తెలిపారు. భారతీయ ఆవుల వల్ల ఎలాంటి సమస్య లేదని ఆయన చెప్పారు. మన ఆవులకు, గ్లోబల్ వార్మింగ్ కు సంబంధం లేదని అన్నారు. గుజరాత్ గోసేవ, గోచార్ వికాస్ బోర్డు సూచన మేరకు ఆయన ఓ పరిశోధన నిర్వహించారు.
మన దేశంలోని ఆవులు సహజసిద్ధంగా జీవిస్తాయని... అదే పాశ్చాత్య జెర్సీ ఆవులైతే ఏదో తింటూ, ఏదో తాగుతూ తరచుగా రోగాల బారిన పడుతూ ఉంటాయని హితేష్ తెలిపారు.

ఈ క్రమంలో పాశ్చాత్య ఆవులకు భారీగా యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సి ఉంటుందని... దీంతో, అవి ఓజోన్ పొరకు హాని కలిగించే మీథేన్ గ్యాస్ ను ఎక్కువగా విడుదల చేస్తుంటాయని చెప్పారు. భారతీయ ఆవులు ఇచ్చే ఏ2 పాలు అన్ని రోగాలకు మందుగా పనికొస్తాయని... జెర్సీ ఆవులు ఇచ్చే ఏ1 పాలు పలు రోగాలకు కారణం అవుతున్నాయని తెలిపారు. ఏ1 పాలలో అమినో యాసిడ్స్ ఉంటాయని... ఇవి టైప్1 డయాబెటిస్, గుండె జబ్బులు, ఆటిజం జబ్బులకు కారణమవుతాయని, జీర్ణవ్యవస్త, మెదడు, అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతాయని చెప్పారు. 

  • Loading...

More Telugu News