: క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కు తండ్రిగా ప్రమోషన్!
టీమిండియా సీనియర్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తండ్రయ్యాడు. ఈ సంతోషకర విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఇర్ఫాన్ భార్య సఫా బేగ్ నిన్న ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జెడ్డాకు చెందిన మోడల్ సఫా బేగ్ ను ఈ ఏడాది మొదట్లో మక్కాలో ఇర్ఫాన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఇర్ఫాన్ సోదరుడు, టీమిండియా ఆటగాడు యూసుఫ్ పఠాన్ కూడా ట్వీట్ చేశాడు. కొత్త పఠాన్ కు మా ఇంట్లోకి ఆహ్వానం పలుకుతున్నామని యూసుఫ్ తెలిపాడు. అయాన్, రయాన్ లకు తమ్ముడు దొరికేశాడని ట్విట్టర్లో తెలిపాడు.