: సౌకర్యవంతంగా ఉంటుందని బ్యాంకులన్నాను... ఇక చేతికే ఇప్పిస్తా: పింఛన్లపై చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లో వృద్ధాప్య పింఛన్ల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలోలా చేతికే డబ్బులిప్పించే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సౌకర్యవంతంగా ఉంటుందని బ్యాంకు ఖాతాల్లో వేయాలన్న నిర్ణయం తీసుకుని రూ. 37 లక్షలు వేస్తే, అవి నిలిచిపోయాయని, ప్రజల అవస్థలు చూసి బాధేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నగదు కొరత ఏర్పడిన తరువాత, తాను మంచి జరుగుతుందని బ్యాంకుల వద్దకు వెళ్లానని గుర్తు చేసిన చంద్రబాబు, ఇకపై అలా జరగదని, పాత పద్ధతిలోనే డబ్బు చేతికే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. బ్యాంకు క్యూలైన్లో నిలబడిన వృద్ధులు కొందరు మరణించిన ఘటనలు తన మనసును కలచి వేశాయని, ఇకపై అలా జరగనివ్వబోనని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు వ్యాఖ్యానించారు.