: 200 పొలిటికల్ పార్టీలకు షాక్ ఇవ్వనున్న ఎన్నికల సంఘం?


దేశవ్యాప్తంగా నమోదైన 200 పార్టీలపై వేటు వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. ఈ పార్టీలు మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో... ఈ 200 పార్టీలను డీలిస్ట్ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ)కు సూచించింది. రాజకీయ పార్టీగా నమోదు చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ పార్టీల ఆర్థిక లావాదేవీలను పరిశీలించాలని సీబీడీటీని కోరింది.

ఎన్నికల సమయాల్లో ఈ పార్టీలు మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. చట్టాల ప్రకారం రాజకీయ పార్టీలను నమోదు చేసే అధికారం మాత్రమే ఎన్నికల సంఘానికి ఉంది. తనకున్న స్వాభావిక అధికారాలతో ఎన్నికల ప్రక్రియను అది నియంత్రిస్తోంది. కానీ, పార్టీలను డీలిస్ట్ చేసే అధికారం మాత్రం ఈసీకి లేదు. అందుకే ఈ విషయంలో సీబీడీటీ సహాయాన్ని ఎన్నికల సంఘం కోరింది. 

  • Loading...

More Telugu News