fire accident: మహారాష్ట్రలోని హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి


మహారాష్ట్రలోని గోండియాలో ఓ హోట‌ల్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించి మంట‌లు చెల‌రేగుతున్నాయి. ఈ మంట‌లు హోట‌ల్ మొత్తం వ్యాపించ‌డంతో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, పలువురికి తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హోట‌ల్ వ‌ద్ద‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘ‌ట‌న‌లో గాయాలపాల‌యిన వారిని ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. హోట‌ల్ వ‌ద్ద‌కు 15 ఫైరింజన్లు చేరుకొని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. స‌ద‌రు హోట‌ల్ లో ఈ అగ్నిమాదం ఎందుకు జ‌రిగింద‌నే అంశం గురించి ఇంకా స్ప‌ష్ట‌తలేదు.

  • Loading...

More Telugu News