: అమృతసర్ ను ఎంచుకున్న సిద్ధూ... కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి!
క్రికెటర్ గా రాణించి, ఆపై రాజకీయవేత్తగా అవతరించి, బీజేపీ తరఫున ఎంపీగా పనిచేసి, ఆపై తన పదవులకు రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ, త్వరలో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ పడనున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. ప్రముఖ సిక్కు పుణ్యక్షేత్రం అమృతసర్ ను ఎంచుకున్న సిద్ధూ, నగరంలోని తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. నిన్న కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీని కలిసి చర్చలు జరిపిన సిద్ధూ, పార్టీలో తన చేరికపై తేదీని ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, అమృతసర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రస్తుతం సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ ఉన్నారు. ఆ స్థానంలో అయితే సులువుగా విజయం సాధించవచ్చని సిద్ధూ భావిస్తున్నట్టు సమాచారం.