: నాటకీయ పరిణామాల మధ్య దూసుకొచ్చిన ఇండియా... బ్రిటన్ ను దాటేయడంపై ఫారిన్ మీడియా


ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్ ను దాటేసిన ఇండియాపై ఫారిన్ మీడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ బిజినెస్ మేగజైన్ 'ఫోర్బ్స్'లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. గడచిన పాతికేళ్లుగా ఇండియాలో వృద్ధి శరవేగంగా సాగుతుండటంతో పాటు నాటకీయ పరిణామాలు భారత్ ను టాప్-6లోకి చేర్చాయని వెల్లడించింది. అంతకుమించి యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని తీసుకున్న నిర్ణయం ఆ దేశపు ఆర్థిక బలాన్ని దెబ్బతీసిందని పేర్కొంది.

నిజానికి 2020లో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను ఇండియా అధిగమిస్తుందని లెక్కలు కట్టారు. అయితే, బ్రెగ్జిట్ తరువాత బ్రిటన్ పౌండ్ దాదాపు 20 శాతం పడిపోవడంతో అనుకున్న సమయం కన్నా ముందుగానే భారత్ ఆ ఘనతను సాధించింది. ప్రస్తుతం యూకే జీడీపీ 1.87 ట్రిలియన్ పౌండ్లు (ఒక డాలర్ తో 0.81 పౌండ్ల మారకంపై 2.29 ట్రిలియన్ డాలర్లు) కాగా, భారత జీడీపీ 153 ట్రిలియన్ రూపాయలు (ఒక డాలర్ 66.6 రూపాయల మారకపు విలువపై 2.30 ట్రిలియన్ డాలర్లు)గా ఉందని ఫోర్బ్స్ వెల్లడించింది. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య ప్రస్తుతం తేడా స్వల్పంగా ఉన్నప్పటికీ, ప్రతి ఏటా ఒకటి నుంచి రెండు శాతం వరకూ పెరుగుతూ ఉండవచ్చని అంచనా వేసింది.

  • Loading...

More Telugu News