delhi: ఢిల్లీలో మ‌రో ఘోరం.. 17 ఏళ్ల అమ్మాయి దారుణహ‌త్య


దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌రో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. న‌గ‌రంలోని న‌జ‌ఫ్‌గ‌ఢ్‌లో ఓ 17 ఏళ్ల అమ్మాయిని ఓ యువ‌కుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ రోజు ఉద‌యం ఈ దారుణ ఘ‌ట‌న జ‌రిగింద‌ని మీడియాకు చెప్పారు. ఆ అమ్మాయిని చంపింది ఎవ‌రనే అంశంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. అయితే, ఆ అమ్మాయి స్నేహితుడు ఒక‌రు క‌నిపించ‌కుండా పోయాడు. ఆ యువ‌కుడే ఈ హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ యువ‌కుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

  • Loading...

More Telugu News