: నా కుమార్తెను పొట్టి రమేష్ ఎన్నడూ వేధించలేదు: త్రిపురాంబిక తల్లి పుష్పలత


తన కుమార్తె త్రిపురాంబిక ఆత్మహత్య వెనుక అల్లుడు పొట్టి రమేష్ ప్రమేయం లేదని, ఆయన ఏనాడూ తన కుమార్తెను వేధించలేదని త్రిపురాంబిక తల్లి పుష్పలత పోలీసులకు స్పష్టం చేశారు. త్రిపురాంబిక ఆత్మహత్య కేసులో అతని పేరును చేర్చవద్దని కోరారు. గడచిన ఏడాదిగా త్రిపురాంబిక అత్తమామలు, ఆడపడుచు మహాలక్ష్మి, ఆమె భర్త మల్లికార్జునరావులు అమ్మాయిని వేధించారని, వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

కాగా, అప్పటికే సెక్షన్ 304 బీ కింద కేసును రిజిస్టర్ చేసిన పోలీసులు, రమేష్ ను సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నటుడు, డ్యాన్సర్ గా రాణిస్తూ, జబర్దస్త్ కార్యక్రమంతో పేరు తెచ్చుకున్న రమేష్ భార్య త్రిపురాంబిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. త్రిపురాంబిక ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్టు వెల్లడైందని పేర్కొన్న పోలీసులు, కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News