: వైకాపాకు మరో షాక్... టీడీపీలోకి పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన!
నేడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ కు, ఆ పార్టీ నేతలకు షాకిస్తున్న వార్త ఇది. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఈ వారంలో సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరవచ్చని తెలుస్తోంది. 2004లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె, ఆ సంవత్సరం నిడుమోలు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆపై 2009లో పామర్రు నుంచి అదే పార్టీ తరఫున ఓడిపోయిన ఆమె, 2013లో వైకాపాలో చేరి, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యను ఓడించారు. ఇక గత కొంత కాలంగా వైకాపా కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆమె, ఇటీవల జరిగిన బెల్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబుతో కలసి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఉప్పులేటి కల్పన ఫిరాయింపు దాదాపు ఖాయమని తెలుస్తున్న నేపథ్యంలో, పామర్రు వైకాపా పగ్గాలు మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ కు అప్పగించవచ్చని తెలుస్తోంది.