: టీడీపీలో 'లూజ్ టాక్'ను సహించేది లేదు: సీఎం చంద్రబాబు


టీడీపీ నేత దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు  పరోక్ష వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ, టీడీపీలో లూజ్ టాక్ (నోరుజారుడు తనం) ను సహించేది లేదని, దాని వల్ల నాయకత్వమే బలహీనపడుతుందని చంద్రబాబు హెచ్చరించారు. పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉందని, ఎవరికీ మినహాయింపులు ఉండవని, పార్టీ ముందు అందరూ ఒక్కటేనన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. నాయకుడు సమర్థుడు కాకపోతే, ఆ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నా నష్టపోతామని, రాబోయే ఎన్నికలు ఏకపక్షం కావాలని, ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని అన్నారు. ప్రతి సోమ, శుక్రవారాల్లో మంత్రులు సచివాలయానికి హాజరుకావాలని చంద్రబాబు ఆదేశించారు.

  • Loading...

More Telugu News