: వర్మ సినిమాలు తీయకపోతే... ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తాం!: దర్శకుడు గుణశేఖర్
రాంగోపాల్ వర్మ ఎంతో మందికి స్పూర్తినిచ్చారని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెలిపాడు. 'శివ టు వంగవీటి' వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఇన్స్ స్టిట్యూట్ లాంటి రాంగోపాల్ వర్మతో రెండడుగులు నడిచే అదృష్టం తనకు కలిగిందని అన్నాడు. ఆయన సినిమాలు చూస్తూ ఎన్నో నేర్చుకున్నామని, నేర్చుకుంటూనే ఉంటామని చెప్పాడు. అలాంటి వర్మ వంగవీటి తరువాత సినిమాలు తీయడం మానేస్తానని ప్రకటించాడని, అయితే అది వదంతి అని అనుకుంటున్నానని అన్నాడు. అలా కాకుండా ఆయన అలాంటి నిర్ణయమే కనుక తీసుకుంటే, ఆయన ఇంటి ముందు దర్శకులంతా కలసి ధర్నా చేస్తామని ప్రకటించాడు. 'శివ టు వంగవీటి' వరకు వర్మ జర్నీ ఆసక్తికరమని గుణశేఖర్ తెలిపాడు.