: ట్రంప్ మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన హార్వర్డ్ యూనివర్శిటీ డాక్టర్లు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మానసిక స్థితి పట్ల హార్వర్డ్ యూనివర్శిటీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్శిటీ సైకియాట్రి విభాగానికి చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఈ మేరకు లేఖ కూడా రాశారు. అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించేలోపలే ట్రంప్ కు మానసిక, ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని లేఖలో కోరారు. ఓ ప్రముఖ వ్యక్తిని కలవకుండానే ఆయన ఆరోగ్య పరిస్థితిని శంకించడం సరికాదని... కానీ, ఆయన మానసిక అస్థిరతను సూచించే కొన్ని ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ లేఖను రాస్తున్నట్టు ప్రొఫెసర్లు లేఖలో పేర్కొన్నారు. ముందుచూపు లేకుండా మాట్లాడటం, విమర్శలకు స్పందించే తీరు, ఆడంబరపు మాటలు, వాస్తవానికి- కాల్పనికతకు తేడా తెలుసుకోలేనితనం తదితర అంశాలను చూస్తుంటే... అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి ట్రంప్ పూర్తిగా ఫిట్ గా ఉన్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు.