: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కరుణ్ నాయర్...మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కోహ్లీ


భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ 4-0 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరల్డ్ నెంబర్ వన్ జట్టు స్థాయికి తగ్గ ఆటతీరుతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో చివరి టెస్టులో 303 పరుగులతో నాటౌట్ గా నిలిచిన కరుణ్ నాయర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. టెస్టు సిరీస్ లో ఆరు వందల పైచిలుకు పరుగులు చేసిన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, జట్టులో యువకులు రాణించడం శుభపరిణామమని అన్నాడు. చివరి టెస్టులో ఆధిక్యంలో నిలవడంతో వికెట్లు తీయడమే లక్ష్యమని నిర్ణయించుకున్నామని చెప్పాడు. రవీంద్ర జడేజా తమ కలను సాకారం చేశాడని తెలిపాడు. డ్రెస్సింగ్ రూంలో సానుకూల వాతావరణం ఆటగాళ్ల మధ్య సాన్నిహిత్యం పెంచిందని, అది విజయానికి మరింత దోహదపడిందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. 

  • Loading...

More Telugu News