demonitisation: న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ దిశ‌గా ప్రోత్సహిస్తే పన్ను మినహాయింపు


న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ దిశ‌గా త‌మ వ‌ద్ద‌కు వచ్చే వినియోగ‌దారుల‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో చిరు వ్యాపారులతో పాటు రూ.2 కోట్లు కంటే ఆదాయం తక్కువగా ఉన్న వ్యాపారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. స‌ద‌రు వ్యాపారుల‌కు విధించే పన్నులో కొంత మినహాయింపు ఇస్తామ‌ని తెలిపింది. ఐటీ చట్టం ప్ర‌కారం రూ.2 కోట్ల‌లోపు ఆదాయం పొందుతున్న వారు 8 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందులో రెండు శాతం త‌గ్గించి ఆరు శాతం మాత్ర‌మే ప‌న్ను వేస్తామ‌ని తెలిపింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిగా డిజిటల్‌ లావాదేవీలు జరిపితే ఈ మిన‌హాయింపు ఇస్తామ‌ని తెలిపింది.
ఇక‌ నగదుతో మాత్ర‌మే లావాదేవీలు నిర్వర్తించే వారికి ఎప్ప‌టిలాగే 8 శాతం పన్ను విధిస్తామ‌ని, ఇందు కోసం చ‌ట్టంలో మార్పులు చేశామ‌ని పేర్కొంది.

కాగా, వ్యవసాయ రుణాలను సకాలంలో చెల్లించేవారికి కేంద్ర ప్రభుత్వం మరోసారి వెసులుబాటు కల్పించింది. స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీని మరో 60 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 

  • Loading...

More Telugu News