: ట్రంప్ బ్యాచ్ తో భారత్ చర్చలు... వాషింగ్టన్ లో ప్లిన్ ను కలిసిన ధోవల్
అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంకా బాధ్యతలు చేపట్టనేలేదు. ఆయన అధ్యక్షుడయ్యాక జాతీయ భద్రతా సలహాదారుగా విధులు నిర్వహించే మైఖెల్ ప్లిన్ ను భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రత్యేకంగా కలిశారు. అగ్రరాజ్యం తదుపరి ప్రభుత్వంతో సైతం బలమైన దోస్తీని నెరపే దిశగా భారత్ తరఫున ధోవల్ తనవంతు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. రెండు దేశాల మధ్యా ఉమ్మడి వ్యూహాలు, ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరి మధ్యా చర్చలు సాగినట్టు తెలుస్తోంది. అభివద్ధి దిశగా దూసుకెళుతున్న ఇండియా ఆర్థిక వ్యవస్థను తాము గౌరవిస్తామని ఈ సందర్భంగా ఫ్లిన్ వెల్లడించినట్టు భారత రాయబార కార్యాలయం అధికారి వెల్లడించారు. కాగా, అధ్యక్ష ఎన్నికలకు పూర్వం ప్లిన్ తో ఫోన్ లో మాట్లాడిన ధోవల్, ఇప్పుడు తాజాగా ఆయనతో భేటీ కావడం విశేషం.