: అమెరికా ఎంబసీ వద్ద కాల్పుల కలకలం... అంకారాలో వరుసగా రెండో ఘటన


టర్కీ రాజధాని అంకారాలో రష్యా రాయబారిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. వేదికపై ఉన్న రాయబారిని పోలీసు దుస్తుల్లో వచ్చిన దుండగుడు షూట్ చేసి చంపేశాడు. ఈ షాక్ నుంచి టర్కీ అధికారులు కోలుకోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. అంకారాలోని అమెరికా రాయబార కార్యాలయం ముందు ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. నల్లటి కోటు ధరించి వచ్చిన ఆ ఆగంతుకుడు... గాల్లోకి ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం ఎంబసీలోకి చొరబడేందుకు యత్నించాడు. కాని, అక్కడ ఉన్న గార్డులు అతన్ని సమయస్ఫూర్తితో ఎదుర్కొని... అతడిని పట్టుకున్నారు. చేతిలోని గన్ ను లాక్కుని, అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయలు కాలేదు. కానీ, వరుసగా రెండో ఘటన జరగడంతో అక్కడి అధికారులు అలర్ట్ అయ్యారు. 

  • Loading...

More Telugu News