: జడేజా మాయ... ఆరోసారి కుక్ ను దొరకబుచ్చుకున్నాడు!
చెన్నైలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ ను అవుట్ చేయడంతో పాటు, ఈ సిరీస్ లో ఆరు సార్లు కుక్ ను పెవీలియన్ కు పంపిన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇలా ఒక సిరీస్ లో ఒకే బౌలర్ చేతిలో ఆరుసార్లు కుక్ అవుట్ కావడం అతనికిదే తొలిసారి. తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో, మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో జడేజా బంతులకు దొరికిపోయిన కుక్, ఆపై నాలుగు, ఐదు టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ జడేజా విసిరిన బంతులకే పెవీలియన్ దారి పట్టాడు. కాగా, ఈ సిరీస్ లో కుక్ సరాసరి కేవలం 12.50కు పరిమితమైన సంగతి తెలిసిందే.