: భార్య ఆత్మహత్య కేసులో జబర్దస్త్ పొట్టి రమేష్ అరెస్ట్


తన భార్య త్రిపురాంబిక ఆత్మహత్య కేసులో టీవీ నటుడు, జబర్దస్త్ ఫేం పొట్టి రమేష్ ను గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ తో పాటు ఆయన తల్లిదండ్రులు పెట్టిన గృహ హింస వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని త్రిపురాంబిక తరఫు బంధువులు కేసు పెట్టడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అత్తమామలు త్రిపురాంబికను వేధించారని, అందువల్లే పెళ్లయిన ఏడాదికే తను ఆత్మహత్య చేసుకుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణలో భాగంగా రమేష్ ను, అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News