: రిలయన్స్ జియోకు గట్టి పోటీ ఇచ్చేలా ఎయిర్ టెల్ రెండు కొత్త టారిఫ్ ప్లాన్లు
4జీ వాయు తరంగాలతో రిలయన్స్ జియో ఉచిత డేటా, కాల్స్ అందిస్తూ, దూసుకుపోతుంటే, పోటీని తట్టుకుని తన మార్కెట్ వాటా తగ్గకుండా చూసుకునేందుకు నంబర్ వన్ టెలికం సంస్థ ఎయిర్ టెల్ మరో రెండు కొత్త ప్లాన్స్ తో ముందుకు వచ్చింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం 'హ్యాపీ న్యూ ఇయర్' ఆఫర్ అంటూ రూ. 549, రూ. 799 రీచార్జ్ తో అపరిమిత కాల్స్, డేటా ప్లాన్ ప్రవేశపెట్టింది. రూ. 549 ప్లాన్ లో అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, 4జీ స్మార్ట్ ఫోన్ లేకుంటే 1 జీబీ 3జీ డేటా, 4జీ ఉంటే 2 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు వింక్ మ్యూజిక్, మూవీ సేవలు అందుతాయి. రూ. 799 ప్లాన్ లో రూ. 549 సౌకర్యాలతో పాటు 4జీ ఫోన్ లేకుంటే 2 జీబీ 3జీ డేటా, 4 జీ ఫోన్ ఉంటే 4 జీబీ డేటా లభిస్తుంది.