: ప్రముఖ టీవీ హాస్య నటుడు పొట్టి రమేష్ భార్య త్రిపురాంబిక ఆత్మహత్య
ప్రముఖ టీవీ హాస్యనటుడు పొట్టి రమేష్ భార్య త్రిపురాంబిక ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖపట్టణంలోని గాజువాకలో సొంత ఇంట్లో ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెల్లూరుకు చెందిన త్రిపురాంబికను రమేష్ గతేడాదే వివాహం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.