: రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘బతుకమ్మ’కు మళ్లీ నిరాశ.. శకటానికి అనుమతి నిరాకరణ
తెలంగాణ ‘బతుకమ్మ’కు మరోమారు నిరాశ ఎదురైంది. వచ్చే నెల ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్‌లో బతుకమ్మ శకట ప్రదర్శనకు రక్షణ శాఖ నో చెప్పింది. గతేడాది కూడా ఈ శకట ప్రదర్శనకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించని విషయం తెలిసిందే. బతుకమ్మ శకటాన్ని ఈసారి రక్షణ శాఖ ప్రాథమికంగా ఆమోదించినా తుది ఎంపికలో మాత్రం తిరస్కరించినట్టు సమాచారం. మరోవైపు రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రదర్శించాలనుకున్న ‘బొర్రా గుహల’ శకటాన్ని రక్షణ శాఖ ప్రాథమిక దశలోనే తిరస్కరించింది. తెలంగాణ బతుకమ్మ శకటానికి పరేడ్‌లో అవకాశం కల్పించాలని టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని కోరనున్నట్టు తెలుస్తోంది.