: ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు?
ఎన్నికల నగారా మోగింది. ఉత్తరప్రదేశ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించనున్నట్లు సమాచారం. డిసెంబర్ చివరి వారంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే అత్యధిక సంఖ్యలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్ర బడ్జెట్ సమర్పించిన అనంతరం ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఎస్ఎస్ సి, ఇంటర్ బోర్డు పరీక్షలకు ముందే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. యూపీ లో ఏడు విడతలలో, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో నాలుగు విడతలలో పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.