: తన ‘క్రిస్మస్ ట్రీ’ ఇదీ అంటున్న అల్లు అర్జున్ !
క్రిస్మస్ ట్రీ ని అలంకరించడమంటే తనకు ఎంతో ఇష్టమని ప్రముఖ నటుడు అల్లు అర్జున్ చెప్పాడు. క్రిస్మస్ వేడుకల్లో క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసిన బన్నీ, దానిని చక్కగా అలంకరించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ‘క్రిస్మస్ ట్రీని అలంకరించడమంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి ప్రతి ఏడాది క్రిస్మస్ ట్రీని అలంకరిస్తూ ఉండేవాడిని. మెర్రీ క్రిస్మస్’ అని బన్నీ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.