: 50 వేల రూపాయలకు శిశువును విక్రయించిన తల్లి
గాంధీ ఆసుపత్రిలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ కు చెందిన ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ మహిళ తన మూడు రోజుల మగ శిశువును 50 వేల రూపాయలకు విక్రయించింది. దీనిపై ఆసుపత్రి సిబ్బంది ఆరాతీయగా విషయం వెలుగు చూడడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆమెను నిలదీసి, ఆ శిశువును కొనుక్కున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు.