cricket: త్రిశతకం చేసిన టీమిండియా ఆటగాడిగా 12 ఏళ్లుగా ఒంటరిగా ఉన్నా.. వెల్కమ్ కరుణ్ నాయర్!: వీరేంద్ర సెహ్వాగ్
చెన్నయ్‌లో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ చివరి టెస్టు మ్యాచులో టీమిండియా బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ బ్యాటు ఝళిపించి త్రిశతకం చేసి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. గతంలో టీమిండియా తరఫున ఇలా త్రిశతకం సాధించిన ఆటగాడు విరేంద్ర సెహ్వాగ్ ఒక్కడే. ఇప్పుడు కరుణ్ నాయర్ టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండవ ప్లేయర్‌గా నిలిచాడు. కరుణ్ సాధించిన ఈ రికార్డు పట్ల సెహ్వాగ్ స్పందించాడు. తన ట్విట్టర్ ఖాతాలో తనదైన శైలితో సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. గత 12 ఏళ్లుగా తాను త్రిశతకం చేసిన ఆటగాడిగా ఒంటరిగా ఉన్నానని, 300 క్లబ్‌లోకి కరుణ్‌కి వెల్కమ్ చెబుతున్నానని, 'ఆల్ ద బెస్ట్' అని పేర్కొన్నాడు.
Yay ! Welcome to the 300 club @karun126 .
— Virender Sehwag (@virendersehwag) December 19, 2016
It was very lonely here for the last 12 years 8 months.
Wish you the very best Karun.Maza aa gaya!